వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని మొండి వెంగనపల్లి గ్రామంలో నడివీధి గంగమ్మ తల్లి జాతర మంగళ వారం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారంరాత్రి గ్రామంలోని పురవీధుల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో భాగంగా ప్రతి ఇంటి ముందు అమ్మవారికి నీటిని సమర్పించి హారతులు ఇచ్చారు. అమ్మవారి ఊరేగింపు వేడుకలు మంగళవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ముగిసింది అనంతరం అమ్మవారు నడీది గంగమ్మ దగ్గర కొలువు తీరారు అనంతరం అమ్మవారికి గ్రామస్తుల చలిపిండి కుంభకూడు సమర్పించారు అంతేకాకుండా అమ్మవారికి మొక్కులు ఉన్న చిన్నపిల్లలు అమ్మవారి ఆలయం చుట్టూ వేయ్య కన్నుల దుత్తలతో ప్రదర్శనలు చేపట్టారు. బుధవారం అమ్మవారిని చెరువు వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు దీంతో అనేది గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది మంగళవారం రాత్రి జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో కోలాటం డప్పు లాంటి విన్యాస కార్యక్రమాలను ప్రజలను ఆకర్షించే విధంగా నిర్వహించారు గ్రామంలో జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు భాస్కర్, వేణు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందుకూరు హుమేష్ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వెంకటేష్ పాల్గొనగా వీరితోపాటు గ్రామంలోని యువత ముందుండి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.