బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామంలో స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం స్థలం కోసం ఎగ్గిడి భాస్కర్ ఇటీవల అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్ టిడిపి మండల అధ్యక్షుడు ఎన్. పి. జయప్రకాశ్ నాయుడు, పాఠశాల వద్ద చేరుకొని తాసిల్దార్ బాబు ప్రసాద్ స్థలాన్ని పరిశీలించి సర్వే చేసి స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణి నాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మండల్ జనరల్ సెక్రటరీ జనార్దన్, లోకనాథ నాయుడు హేమచంద్ర, రమేష్ హరి దూరువాసులు, సూరి కమలాద రెడ్డి,మరియు మండల్ లీడర్స్ మన గ్రామ లీడర్స్ మాజీ బీసీ సెల్ అధ్యక్షులు భాస్కర్ అన్న సర్పంచ్ అభ్యర్థి సుబ్బన్న మల్లయ్య అన్న బాబు అన్న వాసు, హేమగిరి (మరియు) స్కూల్ టీచర్స్ ప్రధాన ఉపాధ్యాయ బృందం టేకుమంద యువకులు గ్రామ ప్రజలు దగ్గర ఉండి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.