బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి శివరాత్రి పండుగ తర్వాత శ్రీకారం చుడతామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, మండల టిడిపి అధ్యక్షుడు జయప్రకాష్ నాయుడు లు తెలిపారు.బుధవారం మొగిలి గుడికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థప్రసాదాలు అందించారు. అంతంతరం దేవస్థానం ఆవరణంలో ప్రజలతో సమావేశం అయ్యి దేవస్థానం దేవస్థానం అభివృద్ధికి తీసుకోవలిసిన చర్యలు గురించి చర్చించారు.దేవస్థానంలో కోనేరు, బాత్రూమ్స్,పార్కింగ్,రూమ్స్, బస్సు స్టాండ్,జనరేటర్,సీసీ కెమెరాలు,మహాశివరాత్రి అయిన తర్వాత పనులు మొదలు పెడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది,వివిధ శాఖల అధికారులు, ప్రజలు,టిడిపి నాయకులు పాల్గొన్నారు.