మనన్యూస్,పూతలపట్టు:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర నాయుడు రూ 2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను మరియు 35.లక్షల వ్యయంతో వెటర్నరీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మంగళ్ విద్యాలయ 24వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ,రామచంద్ర నాయుడు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి,అనేక కష్టాలు భరిస్తూ,ఉన్నత విద్యను అభ్యసించి,విదేశాలకు వెళ్లి అక్కడనే స్థిరపడిపోకుండా ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అని భావించి,కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పించారు.ఈరోజు భారతదేశంలోని అత్యున్నత స్థాయిలో వెలుగొందిన వ్యాపార దిగ్గజం గల్లా రామచంద్ర నాయుడు.అలాగే రాజన్న ఫౌండేషన్ ద్వారా విద్యా,వైద్య వ్యవసాయ పారిశ్రామిక రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు.మంగళ్ విద్యాలయ వార్షికోత్సవంలో భాగంగా రామచంద్ర నాయుడు కల కన్న కలలను విద్యార్థులు నిజం చేస్తున్నారని కొనియాడుతూ మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని.మీకు మంచి భవిష్యత్తును అందించేందుకు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు అలాగే మీ చైర్మెన్ ఎంతగానో కృషి చేస్తున్నారని.క్రమశిక్షణ,నైతికత,ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీ విజయానికి బాటలు వేస్తారని ఆశిస్తున్నాని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ గల్లా రామచంద్ర నాయుడు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి, వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను సృష్టించి,రాష్ట్ర అభివృద్ధిలో తనదైనటువంటి సేవలు అందిస్తూ,ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలందరూ కూడా మంచి విద్యను అభ్యసించాలనే నెపంతో విద్యాసంస్థలను స్థాపించి,అత్యాధునిక బోధనా పద్ధతులతో విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందింప చేస్తున్నారని ప్రశంసించారు.అమర రాజా సంస్థల అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది.ప్రతి విద్యార్థి ఆధునికీకరణ నేపథ్యంలో చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆశిస్తున్నానని అన్నారు.ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో మంగళ్ విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమంలో పేటమిట్ట సర్పంచ్ గల్లా రాధాకృష్ణ, పశుసంవర్ధక శాఖ జెడి ప్రభాకర్,భూగర్భ శాఖ ఇంజనీర్ విజయ్ కుమార్,పూతలపట్టు తెలుగుదేశం మండలాధ్యక్షులు దొరబాబు చౌదరి,రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు రాళ్లపల్లి సతీష్ గారు,పాఠశాల ప్రిన్సిపాల్ గల్లా ధనంజయ నాయుడు గారు మరియు ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.