Mana News :- శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన శెట్టి ఉమామహేశ్వరరావు కు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న నిందితుడు 222 కిలోల గంజాయిని తరలిస్తుండగా బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డాడన్నారు. గంజాయి వ్యాపారంలో సంపాదించిన రూ.1.97 కోట్ల ఆస్తులను గుర్తించి ఫ్రీజ్ చేశామన్నారు. ఇప్పటికే నోటీసులు కూడా అందజేశామన్నారు.