మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నాలతో నాగమడుగు భక్తులతో కిటకిటలాడాయి. మౌని అమావాస్య అనగా సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి కిందికి వస్తుందని భక్తులు నమ్ముతారు. దీంతో ప్రవహించే నీటితో స్నానం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా నది ఒడ్డున గల శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. దీని పక్కన గల నాగ స్వరూపానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎవరికైనా కాల సర్ప దోషాలు ఉన్నట్లయితే స్నానం ఆచరించి ఈ పూజలు నిర్వహించుకుంటారు. దీని ద్వారా ఉద్యోగాలు, సంతానం, వివాహముకు ఆటంకాలు ఉన్న తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ యొక్క పుణ్యస్నానాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. పురోహితులు పూజలు నిర్వహిస్తారు. ఈ నీటిలో ఔషధ తత్వాలు ఉంటాయని దాని ద్వారా చర్మ రోగులు గాని ఇంకా ఏదైనా వ్యాధులు ఉన్న తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ కార్యక్రమాన్ని అచ్చంపేట గ్రామస్తులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అందరూ ఈ భోజనాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే. మల్లికార్జున్, బంగ్లా ప్రవీణ్ కుమార్, బొడ్డు అంజయ్య, చాకలి రమేష్, సురేష్ గౌడ్, లంబాడి కిషన్,సాయిబాబా, మంగలి ఎల్లయ్య ,పిట్ల సత్యనారాయణ, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.