మనన్యూస్,గద్వాల:మానవపాడు మండలం జల్లాపురం స్టేజి సమీపంలో ఆర్ డి ఎస్ కాల్వ పై సోమవారం మధ్యాహ్నం11:00గంటల సమయంలో ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకున్నారు కర్నూలు జిల్లా పంచలింగాల శివారు లోని తుంగభద్ర నది నుంచి ఇసుక లోడ్ తో జల్లాపురం గ్రామం వైపు వస్తున్న టిప్పర్ తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకపోవడంతో మానవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.కానిస్టేబుల్ హరిబాబు ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ వెంకటప్రతాప్ నాయుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనదీ ఎస్త్సె చంద్రకాంత్ తెలియజేశారు