మనన్యూస్,తిరుపతి:నగరంలో టిటిడి నిర్వహణలోని 19 రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు.రుయా ఆస్పత్రి సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్,కపిలతీర్థం నుంచి లీలామహల్ సర్కిల్,మంగళం రోడ్డు,లక్ష్మీపురం సర్కిల్,ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు.19 రోడ్లలో పలు చోట్ల గుంతలు పడి ఉండటంతో పాటు పుట్ పాత్ లు ఆక్రమణలు జరిగి ఉండటాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.రోడ్డు మరమ్మత్తు పనుల పూర్తికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.జీవకోన నుంచి వచ్చే డ్రైనేజి నీరు వినాయక సాగర్ లో కలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆయన ఆదేశించారు.రుయా ఆస్పత్రి నుంచి అన్నారావు సర్కిల్ మార్గంలో ట్రీకటింగ్ ను వెంటనే చేయించాలని ఆయన ఆదేశించారు.అలాగే సెంటర్ బ్యూటిఫికేషన్ కూడా చేయాలని అధికారులను ఆదేశించారు.భక్తులకు,స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా రోడ్లను తయారు చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టిటిడికి చెందిన సివిల్,ఎలక్ట్రికల్ ఇంజినీర్లతో పాటు అటవీ శాఖ అధికారులు,తుడ,మున్సిపల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.