మన న్యూస్,గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు న్యూస్... మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ తెలిపారు గంగాధర్ నెల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటేష్ చిత్రపటానికి టిడిపి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ డైరెక్టర్, సి ఆర్ రాజన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్ మాట్లాడుతూ మాజీ జెడ్పిటిసి వెంకటేష్ ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం... వెంకటేష్ పార్టీకి చేసిన సేవలను ఎనలేనివని కొనియాడారు.. వెంకటేష్ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటాను అని వెంకటేష్ కుమారుడు శివ కు ,కుమార్తె గ్రీష్మ కు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ జిల్లా టిడిపి కమిటీ కార్యదర్శి తలారి రెడ్డప్ప పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు భాస్కర్ దుర్గ ప్రసాద్ రెడ్డి మాధవరెడ్డి అన్న దొరై పాల్గోన్నారు.