మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:
ఉత్తమ సేవా పురస్కారాన్ని పొందిన ఏలేశ్వరం మండల వైద్యాధికారిని జి.ఎస్.ఎస్.కె శైలజ ను స్థానిక వైసిపి నాయకులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ వైయస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శిడగం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి వైద్యాధికారిని గా వచ్చినప్పటి నుండి వైద్యసేవలు ప్రతి ఒక్కరికి సక్రమంగా వైద్యం అందుతుందని అన్నారు. డాక్టర్ శైలజ కు ఉత్తమ సేవ సేవా పురస్కారం లభించటం ఏలేశ్వరం మండలం లోనే కాకుండా గిరిజన ప్రాంత ప్రజలకు కూడా ఆనందదాయక విషయంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజా ప్రతినిధులు ప్రజలు తమ తోటి వైద్యులు సిబ్బంది అందించిన సహకారం వల్లే సేవా పురస్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ శిడగం త్రివేణి, సామంతుల సూర్య కుమార్, బదిరెడ్డి గోవిందు, సుంకర రాంబాబు, నగర పంచాయతీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు