మనన్యూస్,కామారెడ్డి:భిక్కనూర్ గ్రామంలో ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరాం కొండ అంజయ్య జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కైరం కొండ అంజయ్య మాట్లాడుతూ బిక్కనూరు గ్రామంలో 18/1/2018 సంవత్సరంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకోవడం జరిగిందని రూరల్ అగ్రిమెంట్ 2020 సంవత్సరం వరకు 13 వందల రూపాయలు సామాజిక ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని.దాని యొక్క కమిషన్ కూడా ఇవ్వలేదని2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెల కమిషన్ సంవత్సరంలో RBO కార్యాలయంలో అశోక్ చౌహన్ భిక్కనూరు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ కలిసి వేరే పాయింటు ఇస్తామని అంటే ఇవ్వద్దని ఆర్జీ పెట్టుకోవడం జరిగిందని.దానిని లెక్కచేయకుండా ఇంకొక కస్టమర్ కు సర్వీస్ పాయింట్ ఇవ్వడం జరిగిందని దీనివలన నాకు ఆర్థికంగా మానసికంగా నష్టం జరుగుతుందని రీజినల్ మేనేజర్ రవీందర్ గారిని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వేరే పాయింట్ వారికి సపోర్ట్ చేస్తున్నారని, నన్ను పట్టించుకోవడంలేదని నేను గట్టిగా అడిగినందుకు నీవు ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నాడని నేను నష్టపోయిన కమిషన్ తో పాటు పాత కమిషన్ ఇప్పటివరకు ఇవ్వాలని, 2020 సంవత్సరం నుండి 2025 వరకు రూరల్ అగ్రిమెంట్ ఉండగా సెమీ అర్బన్ కమిషన్ ఇస్తున్నారని దీని ద్వారా నేను ప్రతినెల 20 శాతం నష్టపోవడం జరుగుతుందని ఇవన్నీ లెక్కలోకి తీసుకొని నాకు న్యాయం చేయించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగిందని,జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే తగిన న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు.