
మనన్యూస్,తిరుపతి:అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి సమితి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు విద్యార్థులతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి.ముని చందు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఏఐఎస్ఎఫ్ అండదండగా ఉంటుందని అన్నారు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు ప్రజా ఉద్యమాల్లోనే కాకుండా ప్రజాసేవలోనూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్నామంనరు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకున్నారు మరియు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో దేశ ప్రజల ప్రాణాలను దేశ సంపదను దేశ ఖ్యాతిని పెంపొందించడానికి ఎన్నో రకాలుగా నిలుస్తున్న సైనిక దళాలు,పోలీస్ సిబ్బంది,డాక్టర్లు,లాయర్లు, ప్రభుత్వ అధికారులతో పోలిస్తే మా వంతుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి అభి,హేమంత్ సిద్దు,అంజూరు భానుతేజ్,వరసిద్ధి నిఖిల్,డానియల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు