మనన్యూస్,నెల్లూరు:ఎన్టీఆర్ నగర్,మూడు జండాల సెంటర్ వద్ద ఆదివారం ఉదయం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ 15 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించినారు.ఈ సంస్థ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ జనవరి 26 ఈ సంస్థ 15వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు,ఎన్టీఆర్ నగర్,మూడు జండాల సెంటర్ వద్ద ప్రజల ఆరోగ్యం కోసం భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినాము అని అన్నారు.ఈ శిబిరంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసాము అని అన్నారు. కరోనా సమయంలో కూడా ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం సదుపాయం అందించినాము అని అన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మేఘన,డాక్టర్ కిషోర్,డాక్టర్ ప్రత్యూష్, డాక్టర్ కొణతల భాస్కర్,డాక్టర్ యువరత్న,డాక్టర్ బాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టె వెంకటేశ్వర్లు,జనసేన నాయకులు గునుకుల కిషోర్, కృష్ణారెడ్డి,టోనీ బాబు, మోపూరు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్లకు నా ధన్యవాదాలు దాసరి వెంకటరమణ తెలియజేశారు.