మన న్యూస్ : AP Budget 2024 - ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అపూర్వ విజయం ఇచ్చారని, చంద్రబాబుపై ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వానిది లోపభూయిష్టమైన విధానాలు అని.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.. విభజనతో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. అనేక పరిశ్రమలను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 2019 తరువాత జరిగిన పరిణామాలు ఏపీలో చీకటి కోణం. గత ప్రభుత్వం విధ్వంసం పాలన కొనసాగించిందని పయ్యావు పేర్కొన్నారు.గత ప్రభుత్వం ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు చేయలేదు. రాబోయే 25ఏళ్ల ఆదాయాన్ని తగ్గించింది. నిధులను పక్కదారి పట్టించింది. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు చేయలేదు. గత ప్రభుత్వంలో రూ. 1.35లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి. సహజ వనరులను కొల్లగొట్టారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు గత పాలకులు గండి కొట్టారు. దురుద్దేశంతో ఇసుక, ఎక్సైజ్ పాలసీలు రూపొందించారు.
ఏపీ 2024 – 25 వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.
ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్.
రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు.
మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.
రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు.
ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు.
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం.
జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం.
వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు కేటాయింపు.
ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు కేటాయింపు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు కేటాయింపు.
మున్సిపల్, పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు కేటాయింపు.
గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు కేటాయింపు.
జలవనరుల నిర్వహణకు రూ. 16,705 కోట్లు.
పరిశ్రమలు, వాణిజ్యంకు రూ.3,127 కోట్లు.
ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు.
రోడ్లు, భవనాలు రూ. 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.322 కోట్లు
పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు.
పర్యావరణం, అటవీశాఖకు రూ.687 కోట్లు.
ఎస్సీ సంక్షేమానికి రూ. 18,497 కో్ట్లు.
ఎస్టీ సంక్షేమానికి రూ. 7,557 కోట్లు.
బీసీ సంక్షేమానికి రూ. 39,007 కోట్లు.
మైనార్టీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు.
అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు.
ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు.
నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు.
పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు1