మనన్యూస్,తిరుపతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతి అబూబకర్ షాది మహల్ నందు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే గారైన ఆరని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా జరుపుకున్నారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్కూల్ పిల్లలకు క్రీడా సామాగ్రిని పంచిపెట్టడం జరిగింది తదనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ముస్లిం మైనారిటీలు తనకు అత్యంత సన్నిహితులని మైనారిటీల అభ్యున్నతి కోసం మరియు వారికి ఏ అవసరమొచ్చినా వెంటనే నేను స్పందిస్తానని వారికి తగిన విధంగా సహాయం చేస్తానని తెలియపరుస్తూ షాది మహల్ మరమ్మత్తుల కొరకు షాది మహల్ చైర్మన్ మహబూబ్ బాషా కోరిన వెంటనే మున్సిపల్ అధికారులతో సంప్రదించి వెంటనే మరమ్మత్తులకు కావలసిన నిధులను కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయించడం జరిగింది.అంతేగాక తిరుపతిలో ఎప్పటినుంచో అపరిస్కృతంగా ఉన్న ఈద్గా సమస్యలు కూడా తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇంతేగాక తిరుపతిలో ఉన్న మసీదులకు మరమ్మత్తుల కొరకు తన తండ్రి గారి పేరు మీద ఉన్న జేఎంసీ ట్రస్ట్ ద్వారా మసీదుల మరమ్మతులకు నిధులు ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది తదుపరి రాష్ట్ర మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే గారిని కృతజ్ఞతలు తెలుపుతూ అడిగిన వెంటనే షాదీ మహల్ మరమ్మత్తుల కొరకు నిధుల మంజూరు కై ఎమ్మెల్యే గారు చేసిన కృషికి అభినందన తెలుపుతూ ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూర్ భాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కార్పొరేటర్ అనిత తిరుపతి రహిమాని మజీద్ ముచువల్లి అయిన మహబూబ్ బాషా గారు ఇస్మాయిల్ ఎస్ టి వి నగర్ మసీదు కార్యదర్శి రఫీ. తెలుగుదేశం పార్టీ తిరుపతి మైనారిటీ విభాగ నాయకులైన షేక్ నసరుద్దీన్.షేక్ హర్షద్ షేక్ ముబారక్ గారు షేక్ మొహమ్మద్.రఫీ హిందూస్థానీ గారు నెహ్రు నగర్ మసీద్ కార్యదర్శి జాఫర్ గారు ముస్లిం ఐక్యవేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు నిజాముద్దీన్.మరియు పెద్ద సంఖ్యలో ముస్లింలు మరియు హిందూ సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు