మనన్యూస్,తిరుపతి:గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్జీఓ కాలనీలోని అమర్ జవాన్ పార్క్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.మాజీ సైనిక ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅథిగా పాల్గొని అమర జవానుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.76వ గణతంత్ర వేడుకలు దేశం జరుపుకుంటుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.స్వేచ్చ,సమానత్వం,ప్రాధమిక హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు.అంబేద్కర్ వంటి మహనీయులు భారతీయ సమాజం వివక్షకు తావు లేకుండా పరిడవిల్లాలని ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన తెలిపారు.స్వాతంత్ర పోరాటంలో,దేశ రక్షణలో సైనికుల ప్రాణత్యాగాలు దేశం ఎన్నటికి మరువదని ఆయన చెప్పారు.రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి మాజీ సైనికులకు ప్రాధాన్యత ఇస్తూ ఎక్స్ సర్వీస్ మెన్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రాన్ని రానున్న ఐదేళ్ళలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోది సహకారంతో కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.కాగా ఎమ్మెల్యే తన నివాసంతో పాటు ఆర్ సి రోడ్డు లోని షాధీమహల్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమల్లో ఎన్డీఎ నాయకులతో పాటు మాజీ వింగ్ కమాండర్ భాస్కర్ రెడ్డి,కెప్టన్ శాఖమూరి గోపాల్ క్కిరెడ్డిపల్లి వెంకట్,సుబేదార్ లీలా కృష్ణా,హవల్దార్స్ బాలాజీ,ఆనంద రెడ్డి తదితరులు.