మనన్యూస్,తిరుపతి:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు,ఉచిత వైద్య శిబిరాలు,రక్తదాన శిబిరాలు వంటి ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో అధికారుల మన్ననలను పొందుతూ గుర్తింపు తెచ్చుకున్న మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ చేతుల మీద ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్నారు.జ్ఞాన శేఖర్ రెడ్డి మాస్ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి నాటి నుండి సుమారు రెండు దశాబ్దాలపైగా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు,యువతకు శిక్షణ కార్యక్రమాలతో పాటు ఎంపెవర్మెంట్ యూత్ ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించారు.ఈ నేపథ్యంలో ఆయన అందించిన సామాజిక సేవ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాన శేఖర్ రెడ్డి ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లూరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,ప్రజా ప్రతినిధులు జ్ఞాన శేఖర్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.