మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం కార్యాలయం దగ్గర 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగినది.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి,మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన శాఖ గ్రంథాలయ పార్ట్ టైం వర్కర్ జి గోకరన్న.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గ్రంథాలయ భవనంలోని అన్ని రకాల బుక్కులు,విజేత కాంపిటీషన్స్,ఇతర కాంపిటీషన్స్ బుక్కులు అందుబాటులో ఉన్నాయని,ప్రస్తుత ప్రపంచంలో పోటీపడి చదువుతున్న విద్యార్థులకు గ్రంథాలయం ఒక వరం లాంటిదని ఆయన అన్నారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో,విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ రెడ్డప్ప,ఏఈలు ప్రశాంత్,భరత్ రెడ్డి,జే టి ఓ ఖలీల్,మల్లికార్జున్,మహ్మద్,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.