మన న్యూస్ ప్రతినిధి రౌతులపూడి:ముందుగా అందరికి ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా మాతృబూమి కి నా సాష్టాంగ నమస్కారాలు తెలియచేస్తున్న.
రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .నా మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహనుభావులు. అందరికి నా పాదాభివందనాలు.
పదుల సంఖ్యలో రాష్ట్రాలు, వందల సంఖ్యలో ప్రాంతాలు, ఎన్నో మతాలు, మరెన్నో కులాలు, లెక్కల్లో ఉండే భాషలు లెక్కపెట్టలేని యాసలు ఎన్ని ఉన్నా వీటి అన్నిటికి ఒకటే ప్రామాణికం అదే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న గొప్ప దినం ఈరోజు. భారతీయుడు గా పుట్టినందుకు గర్విస్తూ.మరో వంద జన్మలెత్తిన మన భరత గడ్డపైనే పుట్టాలని కోరుకుంటున్న అని చెప్పారు స్కూల్ విద్యార్థుల తో జాతీయగితలాపన చేయించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమం లో రైటర్ రమణ, హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు, రాంబాబు, రాఘవ, నూకరాజు,యామసుందర్, ఉదయకిరణ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .