మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి,మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ పలువురు మండల అధికారులు,విద్యార్థులు సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సూర్యనారాయణ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేపట్టారు.చిన్నారులతో పాటు పలువురు జాతీయ గీతాలను ఆలపించారు.ఈ సందర్భంగా మండలపరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు ఎందరో మహానుభావుల త్యాగాలని గుర్తు చేసుకున్నారు. 1950వ సంవత్సరంలో జనవరి 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అంతేకాకుండా నగర పంచాయతీ కార్యాలయంలో, రెవెన్యూ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ ముత్యాల ప్రభుత్వ కార్యాలయాలలో,ప్రభుత్వ పాఠశాలలను గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చిక్కాల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు,సాదే లావరాజు,ఎంపీటీసీలు పసల సూరిబాబు,కొప్పుల బాబ్జి,కో అప్షన్ సభ్యులు పసల నాగేశ్వరరావు, ఎంఈఓలు బి.అబ్బాయి,వరలక్ష్మి,
ఏ పి ఓ సత్యనారాయణ,హౌసింగ్ ఏ ఈ మణికంఠ,మండల పరిషత్ అధికారులు,పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు..