తవణంపల్లె Mana News, జనవరి-25 :-ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం ఏపీడబ్ల్యుజేఎఫ్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శనివారం నియోజకవర్గంలోని కాణిపాకం లో జరిగిన సర్వసభ సమావేశంలో ఎన్నికల అధికారి చల్ల జయ చంద్ర వెల్లడించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన జాయింట్ సెక్రటరీ ప్రతాప రెడ్డి సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఆపచెప్పిన ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి విలేఖరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.