మనన్యూస్,పినపాక:కరకగూడెం పరిధిలోని నిలద్రిపేట వాలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా.ఇడుమయ్య తండ్రి నంద వయస్సు 48సం,,అను వ్యక్తి మతిస్థిమితం లేక బర్లగూడెం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై చెట్టుకి ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు.మృతుని భార్య పోజ్జమ్మ పిర్యాదు మేరకు కరకగూడెం ఎస్ఐ రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుడు రెండు సంవత్సరాల నుండి మతిస్థిమితం కోల్పోయి గతంలో రెండు సార్లు ఇంటి నుండి బయటకు వెళ్ళితే కుటుంబ సభ్యులు వెతికి పట్టుకున్నట్టు తెలిపారు. దీనిలోని భాగంగా నేడు ఇంటి నుండి బయటకు వెళ్లి బర్లగూడెం సమీపంలోని చెట్టుకి ఉరివేసుకో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతునికి ఒక్క కూతురు,కుమారుడు ఉన్నారని అన్నారు.