మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తిరుపతిలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణ యాదవ్,శరత్ బృందం ఆధ్వర్యంలో అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద 200 మంది నిరుపేదలకు,అనాధలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు,తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి,టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని,యువతకు మంత్రి నారా లోకేష్ మార్గదర్శకులు ఆదర్శమని కొనియాడారు.ఇదే కాకుండా తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో దినేష్ దిలీప్ రూపేష్ రంజిత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.