మనన్యూస్,తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధి నందు ఫ్రూట్ షాప్ వద్ద ముస్లిం యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాపట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్రాష్ర్ట మైనార్టీ కార్య నిర్వహకా కార్యదర్శి షాకిర్ అలి,పాల్గొని కేక్ కట్ చేసి.వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.యువతకు కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు యువత కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ర్ట మైనార్టీ కార్య నిర్వహకా కార్యదర్శి షాకిర్ అలి మాట్లాడుతూ. మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని ఫ్రూట్ మర్చంట్ ముస్లిం యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలియజేశారు.మంత్రి నారా లోకేష్ మైనార్టీల సంక్షేమానికై అనేక పథకాలను తీసుకొని వస్తూ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తూ, మైనార్టీలు అభివృద్ధి కు అహర్నిశలు కృషి చేస్తున్నారని,ఉర్దూ పాఠశాలలు. ఉపాధ్యాయులను నియమించి.ఉర్దూ భాష మెరుగుపరుస్తూ ఉర్దూ విద్యను మైనారిటీల చిన్నారులకు అందుబాటులో తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షులు షఫీ,నూరు మిర్జావలి,వెంకటేశు చౌదరి.మీర్జా ఆజాద్ చానా అహ్మద్ బాషా,జిమ్ లేషా,తహలీల్, మీ మీర్జా శ్రీనివాసులు,ముజిబ్,తదితరులు పాల్గొన్నారు.