మనన్యూస్,చిత్తూరు:జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు వేలూరు రోడ్ లో ఉన్న టిటిడి కళ్యాణమండపం లో ఈనెల 26న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ గెట్ టుగెదర్ కార్యక్రమమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఉదయం 8 గంటలకు రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగర వేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ యూట్యూబ్లో జబర్దస్త్ కమెడియన్లు శ్రీదేవి డ్రామా కంపెనీ కళాకారులు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ప్రతినిధులతో ఎంటర్టైన్మెంట్ డీజే డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులకు కాణిపాకం స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు జ్ఞాపకలను భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు 9346520447 నెంబర్ ఫోన్ పే ద్వారా ఎంట్రీ ఫీజు 500 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చునని నిర్వాహకులు ఉష తెలిపారు.