మనన్యూస్,లింగోజిగూడ:లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా 7 వేల రూపాయల ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా బయట ఉంచిన పాఠశాల పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేదని పరీక్ష రాయదుర్నీయకుండా ఆరుబయట నిలబెట్టడంతో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్ తో గట్టిగా వాదించిన తర్వాత పరీక్షకు అనుమతించినట్లు తెలిపారు.7 వేలు చెల్లించని విద్యార్థిని బయటికి పంపించిన పాఠశాల యజమాన్యం గత ఎనిమిది సంవత్సరాలుగా జిహెచ్ఎంసి కి 14 లక్షల 63 వేల 792 (14,63,792) రూపాయలు జిహెచ్ఎంసి టాక్స్ మరియు ట్రేడ్ లైసెన్స్ 14,48,304 కట్టకుండా ఉన్నందుకు పాఠశాలపై ఏం చర్యలు తీసుకుంటారని అధికారులను కోరారు. సామాన్య మానవులను అలా పరీక్ష రాయకుండా బయటికి పంపిస్తే అభం శుభం తెలియని విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితి ఉంది అందువల్లనే మమ్ములను ఆరుబయట నిలబెట్టారని వారి మనోభావాలను దెబ్బతీశారని ఆయన అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో ఫీజుల విషయంలో విద్యార్థులను ఎవర్ని ఏమీ అనవద్దని వారి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి వారిని ఫీజు కట్టే విధంగా కృషి చేయాలి తప్ప పరీక్ష రాయనీయకుండా బయట ఉంచడం సబబు కాదన్నారు.జిహెచ్ఎంసి కి టాక్స్ కట్టకపోవడంతో పాటు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేదని ఆయన తెలిపారు. పాఠశాల నిర్వాహకులు మల్కా కొమురయ్య ఒక జాతీయ పార్టీ బీజేపీ నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీగా నిలుస్తున్నారు అని అలాంటి వ్యక్తికి ఉపాధ్యాయులు ఎలా ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు.పాఠశాలలు నిర్వహించుకుంటూ వేల రూపాయలు ఫీజులు వసూలు చేయడంతో పాటు అట్టి భవనాలకు టాక్సీ కట్టకపోవడంతో పాటు ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోకుండానే పాఠశాలను నడుపుతున్నారని తెలిపారు. ఇలాంటి వారు ప్రజాసేవ ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెంది శశిధర్ రెడ్డి,రమేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,పల్చం శ్రీధర్ గౌడ్, జూపల్లి ప్రవీణ్,కందికంటి శ్రీధర్ గౌడ్,సుధీర్ రెడ్డి,గౌస్ తదితరులు పాల్గొన్నారు.