మనన్యూస్,గద్వాల జిల్లా:కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ S.A. సంపత్ కుమార్,BRS నీ వీడి కాంగ్రెస్ లో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్ లు కో ఆప్షన్ సభ్యులు సహ 50 మంది చేరిక,జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన 20 వార్డు కౌన్సిలర్ మరియు పట్టణ అధ్యక్షులు మహబూబ్ పాషా,13 వ వార్డు వెంకటేష్ 2 వ వార్డు జూలేక బెంగం, ఉసేన్ బీ,ఖాజా మాయునుదీన్ కొ ఆప్షన్ మెంబర్ జాకీర్,మాజీ కౌన్సిలర్ వెంకటేష్,మైనార్టీ ప్రెసిడెంట్ రఫీ మరియు తదితర ముఖ్య నాయకులు ఈరోజు సంపత్ కుమార్ ఆధ్వర్యం లో BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూBRS పార్టీ 10 ఏళ్లు అధికారం లో ఉండి ఏం చేయలేదు కనుకనే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి నీ చేసారు అని దురదృష్టవశాత్తు నేను ఓడిపోయి ఉండవచ్చు కానీ నేను డిల్లి స్థాయిలో నాకు గౌరవం దక్కడానికి కారణం ఒకసారి ఎమ్మెల్యే అవకాశం యిచ్చిన అలంపూర్ ఓటర్లు కారణం అని అన్నారు.నేను ఓడిపోయినప్పటింక్ నా నియోజక వర్గం ఓడిపోకూడదు అని అభివృద్ధి విషయం లో వెనుకడుగు వేయకుండా మరిత రెట్టింపు శ్రద్ధతో పని చేస్తున్నాను అని అన్నారు అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఇంకా చాలా అభివృద్ధి అవసరం ఉంది అన్నారు.ఆరు గ్యారంటీలు అమలు పరచడం ఒక వైపు అయితే గత BRS ప్రభుత్వం ఒక్కటి అంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు అంతేకాకుండా 12000 రూపాయలు రైతు భరోసా పేరిట అందచేసి రైతులను అందుకునే ప్రభుత్వం కూడా ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆ పథకం కూడా ఎకరానికి 6000 రూపాయలు ఇచ్చే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి.అన్నారు ఆనాటి PCC అధ్యక్షులు యిచ్చిన మాట ప్రకారం భూమి లేని ప్రతి నిరుపేద మహిళలకి 12000 ఒక సంవత్సరానికి అందచేసేలా సర్వేలు నడుస్తూ ఉన్నాయన్నారు.
ఇందిరమ్మ యిల్లు బాలేదు అని డబల్ బెడ్ రూమ్ ఇస్తాం అని గత ప్రభుత్వం మభ్యపెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి నిరుపేద కి ఇందిరం ఇంటి నిర్మాణం కోసం 5.లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.అని అన్నిటికి మించి అయిజా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అని కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే అని సంపత్ కుమార్ వల్ల మాత్రమే సాధ్యం అని వారి వల్లనే అయిజ అభివృద్ధి సాధ్యం అని నమ్మి పార్టీలో చేరిన ప్రతిబొక్కరికి సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు,అంతేకాకుండా చేనేతలకు రికరింగ్ డిపాజిట్ రూపంలో సహాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది
RDS నీటిని ఎలా తెచ్చుకోవాలి అనే విషయం అయిజ పట్టణం వాళ్ళకి అందరికీ తెలుసు కానీ పూణే లో ఉన్నవాడు సింగపూర్ లో ఉన్నవాడు చెపితే ఫోటో లకు పోజులు యిస్తే నీళ్ళు రావు ఎలా నీటిని రైతులకు అందించాలి అన్న విషయం పైన నాకు పూర్తి అవగాహన ఉంది అని అన్నారు.
అంతేకాంకుడ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తం కుమార్ గారు G.O లు PROSIDENG లు సిద్ధం చేసి అనేక విధాలుగా చర్చలు జరిపి అలంపూర్ రైతుల కళ్ళ లో కాంతి చూడటానికి కృషి చేశారు అని తెలిపారు.
ఇప్పుడు కూడా సుంకేసుల కి వెళ్లి అక్కడ S.E తో మాట్లాడి రాహుల్ బొజ్జ గారు ENC అనిల్ ఉత్తం. కుమార్ మాట్లాడిన విషయం గుర్తు చేశారు .
అయిజ సింధనూర్ కి నీరు వచ్చినాయి కానీ కింద వరకు కూడా నీటిని పారైస్తేనే అలంపూర్ లొ ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు అని రైతు సంతోషమే నా సంతోషం అని సంపత్ కుమార్ తెలిపారు.సంపత్ కుమార్ కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు అలంపూర్ శ్రేయస్సు కి కృషి చేస్తాను అని ఆయన అన్నారు,ప్రతి మండలానికి 10 కోట్ల చొప్పున అభివృద్ధి పనులను చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పథం లో తీసుకోవడానికి అందరం కలిసి సమిష్టి గా పని చేద్దాం అని అన్నారు,అంతే కాకుండా ఏ పథకం అయినా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదనే అమలు జరుగుతాయి అని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లవేళల అండగా ఉంటామని అన్నారు,న్యాయంగా ధర్మంగా ఎవరికైతే అర్హత ఉందో వారికే ప్రభుత్వ పథకాలు అందచేయాలని అయిజ. పట్టణంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అన్నారు.అంతేకాకుండా తప్పిదం వల్ల కాంగ్రెస్ పార్టీని వేదిక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి రావాల్సిందిగా కోరారు కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ఆఫిస్ గేట్లు అన్ని వేళల తెరిచి ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు,అధికార ప్రతినిధులు. వార్డు కౌన్సిలర్ లు ,మార్కెటి కమిటీ చైర్మెన్ వైస్ చైర్మెన్ ,గ్రంథాలయ కమిటీ చైర్మెన్ ,RDS మాజీ చైర్మన్, కిసాన్ సెల్ నాయకులు దేవాలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.