మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఆర్టీవో అధికారిణి కవిత అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161 మహారాష్ట్ర, తెలంగాణ, రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో మద్యం, సెల్ పోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని ఆమె సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ వాటికి సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వాహనాన్ని నడిపే ముందు మీ వాహనాన్ని స్థితి తెలుసుకొని వాహనాన్ని నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వాడాలని సూచించారు. కారు ఇతర వాహనాలు నడిపించేటప్పుడు సీట్ బెల్ట్ ను ఉపయోగించాలని అన్నారు.జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 1 తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీవో సిబ్బంది తదితరులు ఉన్నారు.
.