ఇంగ్లాండ్ దేశంలో కింగ్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పొందిన జగనన్న కుమార్తెలకు హర్షా రెడ్డి వర్షా రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి
మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు విద్యార్థి ఇంగ్లీష్ మీడియం అభ్యసించి ఉన్నత దశకు చేరుకోవాలని లక్ష్యంగా ఉన్నత విద్యను ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ మాజీ డిప్యూటీ సీఎం కుమార్తె కృపా లక్ష్మి అన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద కుటుంబం ఆశీర్వాదంతో నేడు జగనన్న ముద్దు బిడ్డలు వర్షా రెడ్డి, హర్ష రెడ్డి ప్రపంచంలో అతిపెద్ద ఉన్నత విద్య యూనివర్సిటీ కింగ్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి గ్రాడ్యుయేటెడ్ పట్టా పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. వీరికి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రాడ్యుయేటెడ్ పొందిన హర్షా రెడ్డి హర్ష రెడ్డిలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కోటి మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద విద్యార్థులుకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాని దూరం చేయడం లక్ష్యంగా సిబిఎస్సి, రద్దు చేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి కాయడం తద్యమని పేద విద్యార్థుల భవిష్యత్తు మారడం ఖాయమని అన్నారు.