మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి చూస్తే అధికారుల పనితీరుపై మండిపడతారు రైతులు. 93 ఏళ్ల క్రితం ప్రారంభానికి నోచుకున్న ఈ నిజంసాగర్ జీరో ఉపకాల్వకు ఒక్క రూపాయి వెచ్చించిన పాపం పోలేదు. కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 62 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అని చెప్తుండగా, 2016లో నాబార్డు కింద నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆధునికరణ, ఉపకల్వల మరమ్మత్తుల కోసం 262 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో 2022 వరకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఇరిగేషన్ శాఖ రికార్డులు చూపుతున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పుడు ప్రధాన కాల్వ వద్ద జీరో ఉపకాలవ ఎందుకు బాగు చేయలేదని రైతుల నుంచి వస్తున్న ఆరోపణలు. శిథిలమైన తూము, కాలువలో పేరుకుపోయిన పూడిక, పిచ్చి మొక్కలతో కాల్వ నామరూపాలు లేకుండా కనిపిస్తుంది. ఈ కాల్వ పై ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యపు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు కాల్వల బాగుకోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని బాగు చేయాల్సి ఉండగా నిధులను మింగేస్తూ చేతులు ఎత్తివేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయంలో 562 కోట్ల రూపాయలు మంజూరు కాగా, 2016లో నాబార్డ్ కింద కేంద్ర ప్రభుత్వం 262 కోట్లు నిధులు మంజూరు చేసింది నిజం సాగర్ కాల్వల బాగుకోసం. కానీ క్షేత్రస్థాయిలో నిజాంసాగర్ మొదలుకొని అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం వరకు ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ, ఉపకల్వల దుస్థితి చూస్తే ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. నిజం సాగర్ ప్రధాన కాలువ వద్దగల జీరో ఉపకాలవ పూర్తిగా శిధిలావస్థకు చేరుకోవడంతో అన్నదాతలు తమ సొంత ఖర్చుతో ఇసుక బస్తాలు వేసి, మీరంతా వృధాగా పోకుండా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా తమ సొంత ఖర్చులతో కాలువల పూడిక కూడా రైతులు తీస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుందని రైతుల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.