మన న్యూస్ లింగంపెట్ జనవరి 17:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామం సబవత్ మోహన్ వయసు 29 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది, లింగంపేట ఎస్సై సుధాకర్ చెప్పిన వివరాలు, సాయంత్రం 6:00 కి రహదారిన పశువులను ఇంటికి తీసుకొని వస్తుండగా ముస్తాపూర్ గ్రామ శివారు రోడ్డు పక్కనుండే నడుచుకుంటూ వస్తుండగా కామారెడ్డి నుండి లింగంపేట్ వైపు వెళ్తున్న లారీ టీఎస్ 12 యు డి 4138 నెంబర్ గల లారీ సభవత్ మోహన్ అనే వ్యక్తిని వేగంగా అజాగ్రత్తగా నడుపుతూ మోహన్ కి వెనకనుండి లారీ ఢీకొట్టగా ,లారీ కిందపడి ఇరుక్కుని పోగా నడుము భాగంలో ఇతర చోట్ల బలమైన గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ హెద్రాబాద్ లో 17 /01 2025, రోజున ఉదయం 5:00 గంటలకి చనిపోయారు మృతుని తండ్రి దారఖాస్తు ఇయ్యాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై సుధాకర్ తెలిపారు