మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం లక్ష్మీపురం పరిధిలో నయరా పెట్రోల్ బంక్ యాజమాన్యం సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం చివరి రోజు కత్తెర పల్లి, పెద్ద తయ్యూరు టీం ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పెద్ద తయ్యురు గెలుపొంద గా రన్నర్స్ గా కత్తెర పల్లి టీం గెలిచారు. గెలిచిన పెద్ద తయ్యూరు టీం కు 30 వేల రూపాయలు నగదు కప్పును అందించారు. ఈ సందర్భంగా నయరా పెట్రోల్ బంక్ యజమాని మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం గెలుపు ఓటములు సహజమని తీసుకోవాలని అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా క్రికెట్ ఆడుకోవాలని క్రీడాకారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ బాలు తదితరులు పాల్గొన్నారు.