-: బిపీఎం లకు సీనియర్ సూపరింటెండెంట్ మార్గ నిర్దేశం
:- తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ కె. జనార్ధన్ రెడ్డి బ్రాంచి పోస్ట్ మాస్టర్ లకు దిశా నిర్దేశం చేశారు.
మన న్యూస్ లింగంపెట్ జనవరి 16:25 కామారెడ్డి జిల్లా,లింగం పెట్ మండలం,లో సమావేశం నిర్వహించి తాడ్వాయి, లింగంపెట్, గాంధారి, మండలాల పరిధిలోని బి పి ఎం లను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ తపాలా జీవిత బీమా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు, ఐ పి పి బి ద్వారా డి బి పి సదుపాయం తో గల ఖాతాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి వారి లబ్ధి కి దోహద పడేలా తపాలా సేవలు అందించాలని ఆయన సూచించారు. కేవలం 200 రూపాయలకే బ్యాంకు ఖాతాలు ,100రూపాయల నుండి చిన్న మొత్తాల పొదుపు (ఆర్ డి) ఖాతాలు తమ బ్రాంచి పరిధిలోని గ్రామ ప్రజలకు అవగాహన కలిగించాలని, తద్వారా ప్రజలఆర్థికస్వావలంబన కు తోడ్పడాలని తెలిపారు. చేయూత పెన్షన్లు, ఉపాధి హామీ పథకం డబ్బుల చెల్లింపు లోసమస్యలుతలెత్తకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనిఆదేశించరు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి తపాలా ఇన్స్పెక్టర్ సుజిత్ కుమార్, పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ పవన్ రెడ్డి, మెయిల్ ఓవర్ సీనియర్,మహబూబ్ రెడ్డి, లింగంపేట్, సబ్ పోస్ట్ మాస్టర్ సూర్య కాంత్, బి పి ఎం లు లింగం, నితిన్, వినోద్, రమ్య తదితరులు పాల్గొన్నారు.