వెదురుకుప్పం, మన న్యూస్ :- గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి అన్నారు ప్రోత్సహిస్తున్న కురివికుప్పం యూత్ ను అభినందించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కురివికుప్పం యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్,వాలీబాల్,చెస్,పబ్జి పోటీలు నిర్వహించి విన్నర్ రన్నర్లకు ఈరోజు గురువారం బహుమతులు అందజేసిన వెదురుకుప్పం టిడిపి నేతలు మండల పార్టీ అధ్యక్షులు లోహనాథరెడ్డి,జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జి మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో కురువికుప్పం టిడిపి ఇన్చార్జి నాదమునిరెడ్డి,స్థానిక సర్పంచ్ అబులరెడ్డి,మండల యువ నాయకుడు చిరంజీవి రాయల్, కార్యనిర్వకులు గిరిధర్ రెడ్డి రామచంద్రయ్య శెట్టి కురివికుప్పం యూత్ తదితరులు పాల్గొన్నారు.