(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు,నిరుపేదలకు సేవలందించడం లో లయన్స్ క్లబ్ ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగ సత్య శ్రీనివాస్,ఏ డి వి ప్రసాద్, ఊర రాజబాబు,తూమురవుతు గురవయ్య, నర్ల చిదంబరం తదితరులున్నారు.