మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మండలంలోని ఎర్రవరం గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు పూరి గుడిసె కాలిపోయి సర్వస్వం కోల్పోయిన వారికి ఎర్రవరం జనసైనికులు ఆర్థిక సహాయం అందజేశారు.వివరాల్లోకి వెళ్తే ప్రమాదవశాత్తు పూరిగుడిసె కాలిని ఘటనలో డబ్బు,బట్టలు కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ వారికి ఎర్రవరం జనసైన టీం తరఫున 5000 రూపాయలు, జన సైనికుడు గంగిరెడ్ల మణికంఠ 5000 రూపాయలు,లక్కీ వెంకట్రావు 500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడమే లక్ష్యంగా జన సైనికులు పనిచేస్తున్నారు అన్నారు.