(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:
సంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు,జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు,కోలా వీరబాబు,కోరుకొండ శ్రీను,మాగాపు రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో 38 మంది మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణయేతల సమక్షంలో ఎంపిక చేపట్టారు.ప్రధమ,ద్వితీయ, తృతీయ విజేతలకు నాయకుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.ప్రధమ బహుమతి మగాపు సరోజకు నాలుగు తులాల వెండి గ్లాసు కోరుకొండ అప్పారావు బహుకరించగా,ద్వితీయ బహుమతి దాడిశెట్టి నందినికి మూడు తులాల వెండి గ్లాసు కోలా వీరబాబుబహుకరించారు.తృతీయ బహుమతి లోలగల సుహాసినికి అందజేశారు.పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాలలో సాంప్రదాయ సంక్రాంతి జరుపుకోవాలని అన్నారు.ఈ ముగ్గుల పోటీలు ద్వారా మహిళలు చిన్నారులు మరింత ఉత్తేజంగా సంక్రాంతి వాతావరణం తీసుకొచ్చారని ఈ సందర్భంగా అన్నారు.ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణయేతలు సుబ్బారావు, నూకరాజు, ఈశ్వరరావు,రాము, జనసేన నాయకులు వరుపులసాయికిరణ్,ఇంద్రయ్య, కోరుకొండ శ్రీను,కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.