(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ఏలేశ్వరం గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏర్పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీ హరిరాజు, పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, అందిన సమాచారం మేరకు ఆదివారం ఏలేశ్వరం ఎస్సై ఎన్. రామలింగేశ్వర రావు వారి సిబ్బంది గ్రామ శివారిలో ఏర్పాటుచేసిన కోడిపందాలు బరి ను గుండాట సంబంధించిన డెంటల్ ను పోలీస్ సిబ్బంది ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎం రామలింగేశ్వర రావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, కోడి పందాలు, పేకాట వంటి జోద ఆటలకు దూరంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం తెలిస్తే 112 కు లేదా స్థానిక పోలీసు అధికారులకు కాల్ చేసి సమాచారం తెలపాలన్నారు సమాచారం అందించిన వారు వివరాలు గొప్యంగా ఉంచుతామని ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు.