(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో ఎస్ సి కోలని యందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంన షేక్ నబీ,షేక్ నాగూర్ మీరా లకు చెందిన తాటాకు ఇళ్లు దగ్ధమైయి. నిలువు నీడ తో పాటు,కట్టు బట్టలుకుడా అగ్నికి అహుతి అవడంతో వీరు పూర్తి నిరాశులయ్యారు.వీరు స్థానికంగా దేవుని బొమ్మలు స్టిక్కర్లు అమ్ముకొని పొట్ట నిప్పుకుని జీవన సాగిస్తారు. ఈ రెండు కుటుంబాల బాధను గుర్తించిన వివేకానంద స్వామి సేవా సమితి సభ్యులు బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం కూరగాయలు అంద చేయగా,గ్రామానికి చెందిన అడప సుబ్రహ్మణ్యం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సంక్రాంతి సమయంలో ఈ కుటుంబానికి ఇటువంటి నష్టం జరగటం చాలా దురదృష్టకమని సేవా సమితి అధ్యక్షులుమైరాల నాగేశ్వరరావు, అడపా సుబ్రహ్మణ్యం సానుభూతి తెలిపారు.మీ కుటుంబాన్ని అధికంగా ఆదుకోవాలని అంటూ వారి ఫోన్ నెంబర్లు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో గోసా నూకరాజు,బిరుసు వీరబాబు, పాల్గొన్నారు.ఎవరైనా దాతలు వీరికి సహాయం చేయదలుచుకుంటే ఈ నెంబర్ల న 6303309600 షేక్ నబీ,
7661020591 షేక్ నాగూర్ మీరా ను సంప్రదించాలని కోరారు.