
మన న్యూస్,కామారెడ్డి:18 సంవత్సరాల నుండి రక్తదానంలో సేవలు చేయడం అభినందనీయం,జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని 17 సంవత్సరాల నుండి 25 యూనిట్ల రక్తాన్ని,తలసేమియా చిన్నారుల కోసం 4500 ల యూనిట్ల రక్తాన్ని,కరోనా వ్యాధి సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను,250 కి పైగా రక్తదాన శిబిరాలను,ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డికి రక్తదాతలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త కొరత లేని సమాజాన్ని తయారు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికి ఆదర్శమని ఇంతమంది రక్తదాతలు ఉండడం కామారెడ్డికే గర్వకారణం అని అన్నారు అత్యధిక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు పాత్రికేయ మిత్రులకు పురస్కారాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద,సిఎంఎస్ గ్రూప్ ఆఫ్ ఫ్రైమ్స్ చైర్మన్ చిలువేరి మారుతి మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయమని,రక్తదానానికి ముందుకు వస్తున్న రక్తదాతలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తానని అన్నారు భవిష్యత్తులో రక్తదాన శిబిరాలను నిర్వహణకు కృషి చేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల చైర్మన్ జైపాల్ రెడ్డి, శ్లోక పాఠశాల కరస్పాండెంట్ జాలిగామ శ్రీకాంత్,కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ వేదప్రకాష్,గంప ప్రసాద్ జమీల్ హైమద్,ఎర్రం చంద్రశేఖర్,వెంకటరమణ,సాయి,అంజల్ రెడ్డి,సుధాకర్,నరేందర్ గౌడ్, రోశయ్య లు పాల్గొనడం జరిగింది.