
మన న్యూస్,చంపాపేట్: చంపాపేట్ డివిజన్ పరిధిలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు -బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి చంపాపేట్ డివిజన్ పరిధిలో కర్మన్ఘాట్ భగత్ సింగ్ యువజన సంఘం నందు శ్రీ సరస్వతి హై స్కూల్ అధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి విద్యార్థులు మహిళమణులు భారీ ఎత్తున ముగ్గుల పోటిలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. పోటీలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ముగ్గులు వేయడం తెలుగువారి సంప్రదాయమన్నారు.సృజనాత్మకత, ప్రతిభను చాటేలా చాలా మంది ముగ్గులు వేశారని కొనియాడారు. శ్రీ సరస్వతి హై స్కూల్ వారు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి మరియు శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ లెక్కల లలిత రెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నరసింహ,వినయ్ కుమార్, అవినా,అనిత, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.