మన న్యూస్,నెల్లూరు జిల్లా: నెల్లూరు కలిగిరి మండలంలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు.తోటల్లో వేసిన డ్రిప్ పైపులు దొంగలించుకొని వెళ్తున్నారు.దొంగలు ఆగడాలకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మండలంలోని అనంతపురం,లక్ష్మీపురం,కండ్రిగ,ఎరుకులరెడ్డిపాలెం గ్రామాల్లో వ్యవసాయ తోటల్లో వేసిన డ్రిప్ పైపులు,మోటార్ లు,ట్రాన్స్ ఫార్మర్లు,నీటి పారుదల కోసం వేసిన పైపులు ఇలా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొంత మంది దొంగలు అపహరించుకొని వెళ్లారు..దాదాపు 30 లక్షలు విలువ చేసే సొత్తు అపహరించుకొని వెళ్లారు..మూడు గ్రామాల రైతులకు సంబంధించిన పరికరాలను దొంగతనం చేసిన వ్యక్తులు ఎవరా అని అరా తీయగా అనంతపురం గ్రామానికి చెందిన సూరిబోయిన మధు,కుమ్మరి శ్రీహరి,నరేష్ లతో పాటు మరో కొంతమంది ముఠాగా ఏర్పడి రాత్రి పూట తోటల్లో,పొలాల్లో వేసి ఉన్న పైపులు, డ్రైపులను దొంగతనం చేసి ఎత్తుకెళ్లేవారు..గుడిలో కూడా వీళ్లు చోరీలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి దొంగతనాలపై రైతులంతా కలసి కలిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..రైతులకు న్యాయం చేయాల్సింది పోయి వైసీపీ నుంచి టీడీపీ కి వలస వచ్చిన మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అనుచరులు కావడంతో వారి పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు..వైఎస్సార్ సీపీ కి చెందిన రైతులకు సంబంధించిన సొత్తు కావడంతో చోరీ చేసిన నిందితుల పై ఎస్సై ఉమా శంకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు సొత్తు ఇప్పించి నిండుతుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.