మన న్యూస్,తిరుపతి:తిరుపతి,వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదు మంది మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం ఉదయం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను కించపరిచేలా మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు.తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసిపి కి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్న సంగతి కరుణాకర్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.ఈ ఘటన పట్ల చింతించాల్సింది పోయి బుద్ధి లేకుండా కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ప్రధాని మోది సహా పలువురు నాయకులు భక్తులు మృతి చెందిన ఘటనపట్ల చింతిస్తుంటే కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను విమర్శించే స్థాయి కరుణాకర్ రెడ్డికి లేదని ఆయన విమర్శించారు.ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 25లక్షలు ఎక్స్ గ్రేసియ ప్రకటించిందని ఆయన తెలిపారు.వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదు మంది మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం ఉదయం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను కించపరిచేలా మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు.తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసిపి కి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్న సంగతి కరుణాకర్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.ఈ ఘటన పట్ల చింతించాల్సింది పోయి బుద్ధి లేకుండా కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ప్రధాని మోది సహా పలువురు నాయకులు భక్తులు మృతి చెందిన ఘటనపట్ల చింతిస్తుంటే కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.సిఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను విమర్శించే స్థాయి కరుణాకర్ రెడ్డికి లేదని ఆయన విమర్శించారు.ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 25లక్షలు ఎక్స్ గ్రేసియ ప్రకటించిందని ఆయన తెలిపారు.