(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం ఏలేశ్వరం;
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను విమర్శించిన అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. పిసిసి అధ్యక్షులు మల్లిపూడి మంగపతి పల్లంరాజు,డిసిసి అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ఆదేశానుసారం ఏలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో జై బాపూజీ,జై భీమ్,జై సం విధన్ అంటూ నినాదాలతో నిరసన ర్యాలీ చేపట్టారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ అంటూ నినాదాలు చేపట్టారు.అంబేద్కర్ పాదాల దగ్గర అమిత్ షా రాజీనామా పత్రాన్ని ఉంచి నిరసన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని లేనియెడల ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని తీర్మానం చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్సీ సెల్ అధ్యక్షులు మొయ్యేటి సూర్యప్రకాశరావు,జిల్లా కాంగ్రెస్ సభ్యులు చోడిశెట్టి సత్యనారాయణ,శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమ్మిల జయరాజు పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.