(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భోగిమంట, హరిదాసులు, గంగిరెద్దులు గొబ్బెమ్మలు విద్యార్థులను అలరించాయి.పాఠశాల హెచ్ ఎం ఎన్.లక్ష్మీ తులసి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన సంస్కృతి,సంప్రదాయాలను తెలియజేయడం మన బాధ్యత అన్నారు.దీనిలో భాగంగానే సంక్రాంతి జరుపుకునే విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించమన్నారు. సంక్రాంతి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి వైస్ చైర్మన్ కె.సూర్య కుమారి,ఉపాధ్యాయులు వెన్నా శ్రీనివాసరావు,ఎం.లోవ ప్రసాద్,ఎం. చిన్నబాబు,ఎ.సూరన్న దొర,ఎస్ఎంసి సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.