మన న్యూస్,మల్లాపూర్: ఉప్పల్ నియోజకవర్గం లో ని నెహ్రు నగర్ హెచ్ సి ఎల్ కేబుల్ రోడ్ లో ఎన్ సాయి కుమార్ నేతృత్వంలోని నీమన్ ఫర్నిచర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మల్లాపూర్ 5వ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి,4వ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాసు పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాజమాన్యం ఎన్ సాయికుమార్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నీమన్ ఫర్నిచర్ యజమాని ఎన్ సాయికుమార్ మాట్లాడుతూ తమ వద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఫర్నిచర్,విద్యాసంస్థలకు సంబంధించిన ఫర్నిచర్, హాస్పిటల్స్,గవర్నమెంట్ ఏజెన్సీ కు సంబంధించిన ఫర్నిచర్ ను అత్యుత్తమ నాణ్యతతో తాము అందిస్తామని తెలిపారు.ఓపెనింగ్ ఆఫర్ గా జనవరి 31 వరకు ఎం ఆర్ పి పై 20% డిస్కౌంట్ కూడా తమ అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జి ప్రీతం సాయి,కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.