మన న్యూస్,గద్వాల జిల్లా: ఆపద సమయంలో పోలీస్ వారు అందించిన తక్షణ సేవలను ప్రజలు గుర్తించి సంతృప్తి వ్యక్తపరచడం ఏంతో అభినందనీయం అని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతి నగర్ పట్టణానికి చెందిన కిరణం వ్యాపారి రమేష్ కిడ్నాప్ కేసును కేవలం 8 గంటలలో ఛేదించిన సందర్బంగా బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బుధవారం జిల్లా ఎస్పీ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కిడ్నాప్ అయిన సంఘటన వివరాలు, పోలీస్ వారిని సంప్రదించిన అంశాలను బాధితుడిని, వారి భార్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ కిడ్నాప్ అయిన భర్త నుండి పోన్ రాగానే భార్య అనుమానాస్పదంగా భావించి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం అభినందనీయం అని, వెంటనే పోలీస్ వారిని సంప్రదించడం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది, IT సెల్ సిబ్బంది ఏంతో శ్రేమించి కేవలం 8 గంటలలో హైదరాబాదు వెళ్లి కేసును చేదించగలిగారు అని అన్నారు. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి మహిళ పోలీస్ స్టేషన్ ను గుర్తించుకొని వచ్చి జరిగిన అన్యాయం పై దైర్యంగా ఫిర్యాదు ఇవ్వగలగాలి అని అప్పుడే వీలైనంత త్వరగా పోలీస్ యంత్రాంగం సమస్యను పరిష్కరించే దిశగా కృషి చెయ్యడం జరుగుతుందని ఎస్పి అన్నారు. మిస్సింగ్ కేసులలో ముఖ్యంగా మహిళల మిస్సింగ్ కేసులలో పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తమై ఛేదించి విదంగా కృషి చేస్తుందని అన్నారు.కిడ్నాప్ కేసు వివరాలు శాంతినగర్ టౌన్ కు చెందిన కిరణం షాప్ యాజమాని మలే రమేష్ బాబు కు తాను అప్పు ఇచ్చిన నూగల రామయ్య బావమరిది శ్రీనివాస్ ను అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేసి మీకు మా భావ ఇవ్వాల్సిన అమౌంట్ వడ్డీ తో ఇస్తామని సోమవారము పోన్ చెయ్యగా అతను మాటలు నమ్మి రమేష్ బాబు హైదరాబాదు వెళ్లి అక్కడకు వచ్చాను అని పోన్ చెయ్యగా తాను రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నానని నాగోల్ చౌరస్తా కు వెళ్లు అక్కడ మా తమ్ముడు ఉంటాడు డబ్బులు ఇస్తాడు అని చెప్పగా వారి మాటలు నమ్మిన రమేష్ బాబు ఆరంఘర్ చౌరస్తా నుండి నాగోల్ కు వెళ్ళగా కు వెళ్ళగా అక్కడకు ఒక వ్యక్తి వచ్చి శ్రీనివాస పంపించాడు అనీ రమేష్ కు చెప్పి ఆదిత్య నగర్ లో ఉన్న ఇంటి వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళమన్నాడు అని చెప్పి రమేష్ ను తిసుకొని ఆటోలో ఒక ఇంటికీ వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఇంట్లొ నలుగురు వ్యక్తులు మంకీ క్యాపులు మరియు బ్లాక్ స్వెటర్స్ వేసుకొని ఉన్న వ్యక్తులు రమేష్ ను గట్టిగా పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కాళ్ళను తాడుతో కట్టి రూములో బంధించి చేతులతో కొట్టి ఫోన్ తీసుకొని మాకు డబ్బులు అవసరం ఉన్నాయి వెంటనే 50 లక్షల రూపాయలు కావాలి మీకు తెలిసిన వాళ్ళతో తెప్పించు లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించడo జరిగింది. మరల కొద్దిసేపటి తర్వాత నీకు తెలిసిన దోస్తులు ఎవరైనా ఉంటే 10 లక్షల రూపాయలు క్యాష్ తెప్పించు లేదంటే ట్రాన్స్ఫర్ చేయించు అన్ని చెప్పగా, రమేష్ స్నేహితులైన శివ నారాయణ కి ఫోన్ చేసి పది లక్షల రూపాయలు తీసుకొని హైద్రాబాద్ కి తీసుకొని రమ్మని చెపించారు . మరియు రమేశ్ భార్య సుభాషిణి కు అనుమానం రాకుండా ఉండడం కోసం వాళ్లు రమేష్ యొక్క నెంబర్ నుండి తన భార్య ఫోన్ కి ఫోన్ చేయించి నాకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయిన్నాను ఏమి కాలేదు డాక్టర్ వద్ద చూయించుకుని వస్తానని చెప్పమని చెప్పగా రమేష్ అదే విధంగా తన భార్యతో ఫోన్లో చెప్పించారు. ఇట్టి విషయంలో భార్యకు అనుమనం రాగ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వగా శాంతి నగర్ ఎస్సై సంతోష్ ఇట్టి విషయం శాంతి నగర్ సీఐ టాటా బాబు, డి.ఎస్పి మొగిలయ్య,జిల్లా ఎస్పీ తెలియజేయగా జిల్లా ఎస్పీ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన కేసును చేదించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రమేశ్ ఫోన్ కాల్, ఇతర సాంకేతిక పరిజ్ఞానo తో వారి లొకేషన్ ను శాంతి నగర్ పోలీసులు గుర్తించి ప్రత్యేక వాహనంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ను అక్కడకు పంపించి రమేష్ ను బంధించిన ఇంటిని చేరడం జరిగింది. పోలీసులను చూసిన నిందితులు కొందరు పారిపోగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని మళ్లీ కారులో బాధితుడిని తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.
పోలీసులు తీసుకున తక్షణ చర్య ద్వారా బాధితుడు ,కుటుంబ సభ్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.