మన న్యూస్ లింగంపెట్ జనవరి 08:25 కామారెడ్డి జిల్లా లింగంపెట్ బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ జన్మదినం సందర్భంగా
తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి ప్రెసిడెంట్ కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ గారిని హైదరాబాద్ కార్యాలయంలో కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పూల దండ వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ బీసీ అధ్యాపకులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ తో భేటీ అయిన దాసు సురేష్ మాట్లాడుతూ బీసీ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం పట్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి ప్రెసిడెంట్ కుమ్మరి యాదగిరి, జిల్లా బీసీ నాయకులు బాబా, పిట్లం మండలం నాయకులు అశోక రాజ్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.