
మనన్యూస్,కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లో గాంధీ గంజ్ లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,,కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి పదవులు ఇచ్చి గౌరవిస్తాం ఈ ప్రాంతంలోని రైతులకు మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి మరియు రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వ నిధులను మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుల రుణమాఫీ ఎన్ని కష్టాలు వచ్చినా అమలు చేసి తీరుతాం సంక్రాంతి నుండి రైతు భరోసా కూడా అందియ్యబోతున్నాం కేటీఆర్ ముఖ్యమంత్రిని అగౌరపరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబద్దాలతో బదనాం చేయాలనుకుంటున్నాడు తన అవినీతి బయటపడకుండా తప్పించుకునే ప్రయత్నం చేయగా కోర్టు ఈరోజు తన తీర్పుతో కేటీఆర్ కు బుద్ధి చెప్పింది సిబిఐ ఈడీ విచారణకు హాజరుకావాలని తెలిపిందని అన్నారు ఇల్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈనెల 28 నుండి కొత్త రేషన్ కార్డులు అర్హులకు మంజూరు చేయబోతున్నాం అన్నారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ,, పదవులు అలంకార ప్రాయం కావద్దు రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలి రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఎదగాలి కరీంనగర్ లో ముల్కనూర్ సోసిటీని పాలకవర్గం సందర్శించాలి. అక్కడి విధానాలను అమలు చేయాలి ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి.. అబద్దాన్ని వందసార్లు చెప్తే నిజమని నమ్మే ప్రమాదం ఉంది నాటి పాలకులు చేసిన 8 లక్షల కోట్ల అప్పు ఫలితంగా నూటికి 10 శాతం వడ్డీ చొప్పున 6500 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నాం వెళ్లే ముందు 40 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం నాడు దండిగా ఆదాయం ఉండి కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారు నాడు ప్రగతి భవన్ వెళ్ళడానికి వెళ్తే గేట్లు బంద్ చేసేవారు విగ్రహాలు పెట్టడం గొప్ప కాదు..వాళ్ళను గౌరవించుకోవడం గొప్ప అంబెడ్కర్ కు ఒక్కరోజైనా దండ వేయలేదు కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించి టూరిజంగా మార్చేలా అభివృద్ధి చేస్తా విద్యార్థుల ఆటపాటలు, నైపుణ్యం పెంపొందించేందుకు 50 లక్షలు మంజూరు చేస్తా ఈ సందర్భంగా సురేష్ షెట్కర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు ఏపీలో కాంగ్రెస్ కు నష్టం కలుగుతోందని తెలిసి కూడా నాడు సోనియాగాంధీ హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇచ్చారు ఫలితంగా వచ్చే ఆదాయంతో తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు తెలంగాణ ఇచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే కేసీఆర్ ఎందుకు పోలేదులు కెసిఆర్ కుటుంబానికి తెలంగాణను దోపిడీ చేయడం తప్ప తెలంగాణ ఇచ్చిన వాళ్లను గౌరవించడం రాదు కామారెడ్డి మార్కెట్ కమిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాను