మనన్యూస్,తిరుపతి: తిరుపతి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సాధించాలనే సంకల్ప బలంతో ముందడుగు వేస్తే జీవితం ప్రతి ఒక్కరు జీవితం సాఫల్యం అవుతుందని పలువురు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యువతుకు దిశా నిర్దేశం చేశారు. డాలర్స్ గ్రూపు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సహకారంతో,మెగా ఇంఫాక్ట్ వారి ఆధ్వర్యంలో యువతకు రెండు రోజులు పాటు తలపెట్టిన వ్యక్తిత్వ వికాస సదస్సు మంగళవారం మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణలు గంప నాగేశ్వరరావు,కమిషనర్ ఎన్ మౌర్య,డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ డాక్టర్ దివాకర్ రెడ్డి, వేణు కళ్యాణ్,ఐఏఎస్ ట్రైనర్ బాలలత అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.ఈ సందర్భంగా డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సామాన్య కుటుంబం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడంలో ఎంతో కృషి ఉందని తెలిపారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలన్న నినాదంతో సమాజ శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం తన సంపాదనలో కొంత వెచ్చిస్తూ సేవా కార్యక్రమాలు చేయూతనిస్తున్నానని తెలియజేశారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర ఎంతో అవసరమని తెలిపారు.అలాంటి యువతను సన్మార్గంలో నడుపుతూ వారిలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సంకల్పంతో రెండు రోజులపాటు యువతకు ఉచితంగా మెగా ఇంపాక్ట్ సదస్సును చేపట్టడం జరిగిందన్నారు.ఈ సదస్సును ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అందులోకించాలని ఆకాంక్షించారు.కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ మారుమూల ప్రాంతానికి చెందిన తాను సాధించాలని లక్ష్యంతో నిరంతర ప్రయత్నం చేయడంతోనే నేడు ఐఏఎస్ అధికారిగా నిలిచానని తెలిపారు.ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పయనిస్తూ తమ లక్ష్యాల సాధనలో నిరంతర ప్రయత్నంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రమశిక్షణ,పట్టుదల సాధించాలని లక్ష్యం ఉంటే ఎంతటి అడ్డంకులు అయినా ఎదుర్కొని విజయం బాట పట్టవచ్చు అన్నారు. నిరంతర విద్యార్థుల అన్వేషణ సాగిస్తూ ఉన్నత లక్ష్యాల సాధనకై యువత ప్రయత్నించినప్పుడు వారి భవిష్యత్తు ఉజ్వల మౌతుందని తెలిపారు. ఐఏఎస్ ట్రైనర్ బాలా లత మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని, నిత్య ప్రయత్నంతో విజయం సాధించవచ్చుఅని తెలిపారు. ఇందుకు నిదర్శనం మహనీయుడు వివేకానంద స్వామి అని తెలియజేశారు. తాను మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన నిరంతర ప్రయత్నంతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు కళ్యాణ్ మాట్లాడుతూ ఓటమి ప్రతి ఒక్కరి జీవితానికి గునపాటమని, తద్వారాన్ని భవిష్యత్తులో విజయం సాధ్యమని స్పష్టం చేశారు. తాము చేసే ప్రయత్నంలో సమస్య ఎదురైన సమన్వయంతో ముందడుగు వేస్తే పరిష్కారం లభిస్తుందన్నారు.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనలో అవలంబించాల్సిన మార్గాలను గురించి ప్రజెంటేషన్ చేశారు. ఇంపాక్ట్ కన్వీనర్ నడ్డి నారాయణ మాట్లాడుతూ సమాజంలో వివేకానందుడు అబ్రకం లింకన్,మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, వంటి వారు నిరంతర ప్రయత్నంతో లక్ష్యాలు సాధించి చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచారన్నారు.ఇలాంటి వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకుని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదాని కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2000 మంది విద్యార్థులు యువతి యువకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ కన్వీనర్లు తహసున్నీసా బేగం, విభూషణ శర్మ, డాలర్స్ గ్రూపు సిబ్బంది పాల్గొన్నారు.